AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమరావతి ప్రజా పాదయాత్ర…

1 min read

AABNEWS : విజయవాడలోజరిగే “అమరావతి ప్రజా పాదయాత్ర”కు తరలి రావాలని పిలుపు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతేని ప్రకటించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు ఈ నెల 17తో ఏడాది పూర్తికానున్న సందర్భంగా వారి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ, రైతు ఐకాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో నిర్వహించే “అమరావతి పరిరక్షణ ప్రజా పాదయాత్ర”కు ప్రజలు తరలి రావాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్లు ఎ.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు కోరారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ ప్రజా పాద యాత్ర, మంగళవారం మ మ. 3 గ.లకు విజయవాడ పడవుల రేవు సెంటర్ నుంచి బీఆర్డీఎస్ రోడ్డు మీదుగా మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వరకు కొనసాగుతుందని తెలిపారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ఉద్యమం ఏడాది పూర్తియైనా సందర్భంగా ఈ నెల 17వ తేదీన ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున మహిళామూర్తులు,, విద్యార్థి, యువజన, కర్షక, కార్మిక, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సీనియర్ సిటిజన్స్, ధార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు, ఎన్.జీ.ఓ. సంఘాల నాయకులు, సభ్యులు, అన్ని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పుర ప్రముఖులు, కవులు, కళాకారులు, రైతు సంఘాల నాయకులు, సభ్యులు, గేయకారులు, మహిళామండలి సభ్యులు మరియు అమరావతి రాజధాని అభిలాషపరులందరు వేలాదిగా పాల్గొని ఈ ప్రజా పాదయాత్రను దిగ్విజయం చేయవలసినదిగా కోరారు.

 116 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.