AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమరావతి రైతులకు అండగా…

1 min read

AABNEWS : అమరావతి: రాజధాని అమరావతి రైతులకు కేంద్ర మానవహక్కుల సంఘం బాసటగా నిలిచింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ లేఖ రాశారు. రాష్ట్రపతి, గవర్నర్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్‌కు సుంకర పద్మశ్రీ లేఖలు రాశారు. పద్మశ్రీ లేఖపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందించింది. లేఖను కోడ్ చేస్తూ పద్మశ్రీకి తిరిగి సమాచారం పంపింది. కొత్త వారు తమ గ్రామాల్లోకి వస్తున్నారని తెలిసి ఆపినందుకు కృష్ణయపాలెంలో రైతులపై వైసీపీ నేతతో కేసు పెట్టించారని పద్మశ్రీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించారని.. ఇంతకన్నా దౌర్జన్యకాండ మరొకటి ఉండదని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై చర్యలు తీసుకుని.. ఆందోళన చేస్తున్న రైతులకు రక్షణ కల్పించాలని సుంకర పద్మశ్రీ ఫిర్యాదు చేశారు

 128 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.