ఏపీలో రోడ్ల మరమ్మతులకు రూ.2,205 కోట్లు పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
1 min read
AABNEWS : అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 7,969కి.మీ మేర మరమ్మతులు పూర్తి చేసేందుకు రూ.2,205 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రహదారులు 2,726కి.మీ, జిల్లా రహదారులు 5,243 కి.మీ మేర మరమ్మతులు చేపట్టనున్నారు.రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ (ఆర్డీసీ) ద్వారా నిధులు కేటాయింపునకు ప్రభుత్వం అనుమతించింది. నిధుల కోసం పెట్రోల్, డీజిల్పై విధించే సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించనుంది. తద్వారా బ్యాంకుల నుంచి ఆర్డీసీ రుణం తీసుకోనుంది. అనంతరం ఆ నిధులతో రహదారులు, భవనాల శాఖ రోడ్ల మరమ్మతులు చేపట్టనుంది.
991 Total Views, 15 Views Today