ఏలూరుకు రానున్న డబ్ల్యూహెచ్‌వో బృందం…
1 min read
AAB NEWS :
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధితో జనాలు పిట్టల్లా ఎక్కడికక్కడ పడిపోతున్నారు. రెండ్రోజులుగా అసలు ఈ వ్యాధేంటి..? ఎందుకిలా వస్తోంది..? అనేదానిపై వైద్యులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరిలో 243 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 16 మందిని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 183 మంది చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో ఏలూరులో అసలేం జరుగుతోంది..? జనాలకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు..? ఇంతకీ ఆ వింత వ్యాధి ఏంటి..? అని తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైద్య బృందం మంగళవారం నాడు ఏలూరుకు రానుంది. ఈ బృందం ఏలూరులో వింత వ్యాధిగా సంచలనం రేపుతున్న వైనంపై అధ్యయనం చేయనుంది. ఈ బృందంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఉన్నారని వైద్య అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రపంచ దేశాల దృష్టి పడటంతో వ్యాధిని నిర్ధారించేందుకు డబ్ల్యూహెచ్‌వో బృందం రానుంది.
అత్యవసరంగా కేంద్ర వైద్య బృందం మంగళవారం నాడు కేంద్రం వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపుతోంది. రేపు ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై ఈ బృందం విచారణ చేయనున్నది. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్.. అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ అవినాష్ డియోష్టవర్.. వైరాలజిస్ట్, డాక్టర్ సంకేత్ కులకర్ణి వీరంతా.. రేపు సాయంత్రం నాటికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (పిహెచ్ డివిజన్) నుంచి ఈ బృందానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటికే ఏలూరుకు వెళ్లిన మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించింది. అయితే బాధితుల్లో ఎక్కువ మంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారేనని, వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపించామని, రిపోర్టుల ఆధారంగా వ్యాధిని నిర్థారిస్తామని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.
38 Total Views, 2 Views Today