AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సిఎం:

1 min read

AAB NEWS: అమరావతి : చిరు వ్యాపారులకు చేయూతగా.. ఆంధ్రప్రదేశ్‌ లో సిఎం వైఎస్‌ జగన్‌ మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న తోడు’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. చిరు వ్యాపారులకు బ్యాంకు నుంచి రూ.10 వేల రుణాన్ని అందించనున్నారు. మొదటగా 10 లక్షల మంది వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాన్ని అందిస్తున్నారు. ఇక బ్యాంకు అకౌంట్లు లేనివారికి అకౌంట్లను కల్పించబోతున్నారు.అయిదడుగులు, అంతకంటే తక్కువ స్థలంలో ఉన్న షాపులకు, ఫుట్‌ పాత్‌ లపైన, తోపుడు బండ్లపైన, గంపల్లో వివిధ వస్తువులను పెట్టుకొని ఊరూరా తిరిగి అమ్ముకునే వ్యాపారాలు ఈ తోడు స్కీమ్‌ కి అర్హులని సిఎం జగన్‌ తెలిపారు. గ్రామాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలు ఆదాయం ఉన్నవారు ఈ స్కీమ్‌ కి అర్హులని సిఎం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సిఎం వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బ్యాంకు బ్రాంచీల ద్వారా రుణాలను పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. పథకానికి ఎంపిక కాకపోతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అర్హులైనవారు గ్రామ సచివాలయాల్లో నెలలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వారికి రెండు నెలల్లో రుణాలను ఇప్పిస్తామన్నారు. అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేనివారి కోసం కాల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయం అందనివారు 1902 నంబర్‌ కు ఫోన్‌ చేసి సాయం పొందవచ్చని సిఎం జగన్‌ పేర్కొన్నారు.

 44 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.