AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తాం…

1 min read

AAB NEWS : పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వాపోయారు. అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశామన్నారు. పీపీఏ అథారిటీలో కూడా సవరించిన అంచనాలపై రాష్ట్ర తరపున వాదనలు వినిపించామని వెల్లడించారు. పోలవరాన్ని వైఎస్సార్‌ ప్రారంభిస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తున్నారని చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా ఆహానిస్తామన్నారు.

కీలక బిల్లులు ఆమోదం

ఏపీ వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ థర్డ్‌ అమైన్‌మెంట్‌ను బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. యానిమల్‌ ఫీడ్‌, క్వాలిటీ కంట్రోల్‌ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. మంత్రి సీదిరి అప్పలరాజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ స్టేట్‌ డెపలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, వ్యవసాయ భూముల (వ్యవసాయేతర అవసరాల మార్పిడి) సవరణ బిల్లు-2020 (ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ (కన్వర్షన్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ పర్పస్‌) అమెండ్‌మెంట్‌ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.

చారిత్రక బిల్లు: కన్నబాబు

అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదో చారిత్రక బిల్లు అని, రైతులకు మరింత మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. దేశానికి వెన్నముఖగా నిలిచిన వ్యవసాయ రంగానికి కౌనిల్స్‌ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుం‍దని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి వారధిగా అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఉంటుందన్నారు.అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ద్వారా రైతులకు విలువైన సూచనలు అందుతాయని.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దీని పరిధిలో ఉంటాయన్నారు. వ్యవసాయ పట్టభద్రులను ప్రైవేట్‌ ప్రాక్టీస్‌కు అనుమతిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతులు రద్దు చేస్తామనితెలిపారు.

 94 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.