పల్లెపల్లెకూ ఫ్యామిలీ డాక్టర్…
1 min read
AABNEWS : వైద్య సౌకర్యాలు కొరవడిన రాష్ట్రంలోని పల్లె పల్లెకూ డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్‌సీలు ఉండాలని, ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్‌కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు.ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఆరోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్ చేయగలుగుతారన్నారు. వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు.
107 Total Views, 2 Views Today