AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బాబు కావాలనే దాడి చేయించుకున్నారా…?

1 min read

AAB NEWS : అమరావతి: అసెంబ్లీ లాబీల్లో మంత్రి కొడాలి నాని చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మరోమారు ఆయన టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఐదు రోజుల అసెంబ్లీ సరిపోకపోతే.. జూమ్, ట్విట్టర్‌లో సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు. జగన్, పేర్ని నాని కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ నీచంగా మాట్లాడుతోందన్నారు. అలిపిరిలో చంద్రబాబు కూడా కావాలనే దాడి చేయించుకున్నారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. తమకు తమ భ్రదత కన్నా.. ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కొడాలి నాని పేర్కొన్నారు.

 62 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.