మంచి నిర్ణయం…
1 min read
AAB NEWS : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ… ఇప్పుడు సీఎం జగన్ 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మంచి నిర్ణయమని ప్రశంసించారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లులో అనేక మంచి అంశాలు ఉన్నాయని, ఈ బిల్లును సమర్థించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్‌ను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అసైన్డ్ ల్యాండ్స్ సవరణ చట్టాన్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో11 బిల్లులు చర్చకు రానున్నాయి. పోలవరం, కరోనా కట్టడి, బీసీ సంక్షేమ కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించనున్నారు.
32 Total Views, 2 Views Today