September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మేం కట్టిన ఇళ్లకి మీ స్టిక్కరా…?

1 min read

AAB NEWS : కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాలు: జగన్‌
ఇళ్ల అంశంపై అసెంబ్లీలో వాదోపవాదాలు

అమరావతి: పేదల ఇళ్ల అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గృహనిర్మాణంపై చర్చలో భాగంగా టిడ్కో ఇళ్ల అంశంపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు రావడం లేదని, కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితీ లేదని చంద్రబాబు ఆరోపించారు. అనిశ్చిత పరిస్థితి సృష్టించారని విమర్శించారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్‌లు ఉంటాయని.. బాబు స్కీమ్‌, జగన్‌ స్కీమ్‌లు ఉండవన్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి ఈయన అంటూ జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు విమర్శలు చేయగా.. ఆధారాలతో తాను మాట్లాడతానని ఆయన బదులిచ్చారు. దీనికే ఉలిక్కి పడుతున్నారని.. చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నారు. పేర్లు చాలా పెట్టుకుంటున్నారని.. స్టిక్కర్‌ సీఎంగా మిగిలిపోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము కట్టిన ఇళ్లకి మీ స్టిక్కర్‌ వేసుకోవడమేంటని ప్రశ్నించారు. రూపాయికే ఇళ్లు ఇస్తామనేది తప్పుడు ప్రచారమని ఆరోపించారు.

చంద్రబాబుకు స్పష్టత లేదు: అమరావతి: పేదల ఇళ్ల అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గృహనిర్మాణంపై చర్చలో భాగంగా టిడ్కో ఇళ్ల అంశంపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు రావడం లేదని, కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితీ లేదని చంద్రబాబు ఆరోపించారు. అనిశ్చిత పరిస్థితి సృష్టించారని విమర్శించారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్‌లు ఉంటాయని.. బాబు స్కీమ్‌, జగన్‌ స్కీమ్‌లు ఉండవన్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి ఈయన అంటూ జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు విమర్శలు చేయగా.. ఆధారాలతో తాను మాట్లాడతానని ఆయన బదులిచ్చారు. దీనికే ఉలిక్కి పడుతున్నారని.. చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నారు. పేర్లు చాలా పెట్టుకుంటున్నారని.. స్టిక్కర్‌ సీఎంగా మిగిలిపోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము కట్టిన ఇళ్లకి మీ స్టిక్కర్‌ వేసుకోవడమేంటని ప్రశ్నించారు. రూపాయికే ఇళ్లు ఇస్తామనేది తప్పుడు ప్రచారమని ఆరోపించారు.

 110 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.