AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాజధాని రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ …

1 min read

AABNEWS : సంవత్సర కాలంగా కన్నీటి ఉద్యమాలు చేస్తున్న అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసిన – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ తో అమరావతి రాజధాని రైతుల ఉద్యమాలు సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఉయ్యూరు లో రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి వారికి మద్దతు తెలపడం జరిగింది . ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ సంవత్సర కాలంగా రాజధాని రైతులు ఎండనక, వాననకా, రాత్రనక, పగలనక కన్నీటి ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి పట్టనట్లు ఉండటం దారుణమని, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వానికి, ఆ నాయకులకు అమరావతి రాజధాని రైతుల కన్నీళ్లు, గుండె కోతలు కనబడటం లేదా అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అయినా అమరావతిని రాజధానిగా ప్రకటించేటప్పుడు మీ సలహా కోరితే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు పూర్తిగా అంగీకారమే, కానీ 30000 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించండి అని సలహా ఇచ్చి,మీరు అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అనడం ఎంతవరకు న్యాయమని, మీరు భగవత్గిత, బైబిల్, ఖురాన్ లాగా భావించే ఎన్నికల మేనిఫెస్టో లో 3 రాజధానుల అంశం ఎందుకు పొందు పరచలేదని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని 3 రాజధానుల ప్రక్రియ మనకు మాత్రం ఎందుకని, కేవలం అవగాహన లేని పరిపాలన వలనే ఈ నిర్ణయాలని, రాజధాని అంశం రాష్ట్ర అభివృద్ధికి, భావితరాల భవిష్యత్తుకి సంభందించిన విషయం కాబట్టి మీ మొండి వైఖరి వీడి రైతుల ఆవేదన అర్ధం చేసుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపరెడ్డి వాసు, పండ్రాజు చిరంజీవి, అబ్దుల్ నజీర్, LP రఫీ,తోట శ్రీను,తోట జ్యోతి,నడిమింటి పైడయ్య,పరిమి భాస్కర్,అజ్మతుల్లా, ఫణి, శ్రీనివాస్, బాబీ, అంజి, కిరణ్,నరేష్,రవి, శోభారాణి, జరీనాబేగం,నాగమణి,సురేష్, గఫార్, సాంబశివరావు, శివ, బాజాని, అయ్యప్ప, రమేష్, సత్యం, అనిల్, అప్పలనాయుడు, విజయ్, సలీమ్, శ్రీను,సల్మాన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

 166 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.