September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రేపటి బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం

1 min read

AABNEWS : అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బంద్‌ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత యథావిధిగా ఆ బస్సులు తిరుగుతాయన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధిగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని పేర్ని నాని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు..

 114 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.