AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సొంత ఊర్లోనే మహిళలకు రక్షణ కరువు…

1 min read

AAB NEWS : అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ”జగన్ రెడ్డి గారి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టాల పేరు చెబుతూ కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదు. మహిళలపై రాష్ట్రంలో వరుసగా జరుగుతన్న అత్యాచారాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యాచారానికి గురైంది.ఈ విషయం బయటకి రాకుండా చెయ్యడానికి ప్రభుత్వం పెడుతున్న శ్రద్ద మహిళలకు రక్షణ కల్పించడంలో పెట్టాలి. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి అత్యంత కిరాతకంగా నాగమ్మని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ లోకేష్ అన్నారు.

 216 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.