AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

హై టెన్షన్‌…

1 min read

AABNEWS : అమరావతి : అమరావతి రాజధాని రైతుల ఉద్యమం నేటితో సంవత్సరం అవుతున్న నేపథ్యంలో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభ నిర్వహిస్తున్నారు. అనేక ఆంక్షలు, నిర్బంధాలతో రైతులు ఉద్యమాన్ని సంవత్సరం పూర్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మూడు రాజధానులకు అనుకూలంగా మందడంలో కూడా దీక్షలు చేస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెం, అమరావతి రైతులకు, మూడు రాజధానుల కోసం ఆందోళన చేస్తున్న వారికి ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు రాజధాని రైతులపై కేసులు నమోదు చేశారు. కాగా నేడు రాజధాని గ్రామం అయిన రాయపూడిలో సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జనభేరి సభ జరగనుంది. జనభేరికి భారీగా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు తరలివచ్చారు. ఆకుపచ్చ కండువా, ఆకుపచ్చ వస్త్రాలు ధరించి రైతులు, మహిళలు పెద్ద ఎత్తుకు సభకు చేరుకుంటున్నారు. అదేవిధంగా జనభేరి సభకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ, టిడిపి, బిజెపి, జనసేన, నవభారత్‌, ముస్లింలీగ్‌, తదితర పార్టీలు, రైతు సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. సభకు పలువురు రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రానున్నారు. చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. దీంతో జనభేరి సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. సభకు హాజరుకాకుండా వివిధ పార్టీల నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. బయట ప్రాంతాల నుండి ఎవరు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. సభకు వెళ్లకుండా ఇప్పటికే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, తూర్పుగోదావరి అచ్చంపేటలో మాజీ మంత్రి చినరాజప్ప, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

 92 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.