AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలి…

1 min read

AAB NEWS : లక్షేట్టిపేట్ మండలం:అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలి.ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలి.లక్షేట్టిపేట మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు..
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా ను అరికట్టే విషయంలో లాక్ డౌన్ ను అమలు చేస్తుంది.ఈ లాక్ డౌన్ వల్ల చాలా మంది పేద ప్రజలు ఉపాధి లేక పనులు లేక ఇంట్లో ఉంటున్నారు.చిన్న చిన్న వ్యాపారస్తులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం పట్టణాలకు వలస వచ్చి అదే ఇండ్లలో ఉంటున్నారు.ఈ సమయంలో రేషన్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 10 కిలోల బియ్యం,రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తోంది.కేవలం రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే బియ్యం ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదు.ఎందుకంటే చాలామంది ప్రజలు గత రెండు,మూడు సంవత్సరాల క్రితం నుంచి రేషన్ కార్డు మార్పులు గురించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది.కానీ ప్రభుత్వ సైట్ ఆన్లైన్ సమస్యల వలన చాలా మంది పేద ప్రజలకి రేషన్ కార్డు ఇప్పటికీ అందలేదు.మరోవైపు ప్రతిరోజు మనం తినే అటువంటి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కనీసం కొనుక్కో లేని స్థితిలో ఈ రోజు ప్రజలు ఉన్నారు.ఈ ధరల విషయం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడలేదు.లాక్ డౌన్ వలన సామాన్య పేద ప్రజల పైన ఆర్థిక భారం పడుతుంది.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా 15 కిలోల బియ్యం పంపిణీ చేయాలి.అదే విధంగా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు ఆన్లైన్ సమస్యను పరిష్కరించాలి.

 127 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.