September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆంధ్ర ప్రజలను మోసం చేసింది,ఇలాంటి పరిస్థితులలో కేంద్ర పై యుద్ధం చేయాలంటే ప్రశ్నించే గొంతు మాజీ కేంద్రమంత్రి,టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాకలక్ష్మి…

1 min read

AABNEWS : ఏపీకి ప్రాణవాయువులాంటి  ప్రత్యేక హోదా ఇవ్వబోమని మోదీ తేల్చి చెబుతున్నా నోరెత్తలేని స్థితిలో వైసీపీ వుందని అదేవిధంగా విభజన చట్టంలో ఉన్న అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలను మోసం చేసింది,ఇలాంటి పరిస్థితులలో కేంద్ర పై యుద్ధం చేయాలంటే ప్రశ్నించే గొంతు కావాలంటే ఒక్క అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తిరుపతి ప్రజలను కోరారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు తిరుపతి అభివృద్ధి కోసం పోరాడతానని ఆమె స్పష్టం చేశారు.తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాళెం హరిజనవాడ నుంచి  గురువారం  సాయంత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.మళ్లీ వైసీపీ ఎంపీని గెలిపిస్తే అభివృద్ధి ఉండదని, హోదా రాదని స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయన్నారు. మహిళలపై 22నెలల్లో 8శాతం నేరాలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ అభివృద్ధి, మన్నవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని, ఏమాత్రం అభివృద్ధి ముందుకు సాగలేదని వాపోయారు. ప్రజలంతా రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లోపడిపోయారన్నారు.ప్రచారంలో భాగంగా పనబాక లక్ష్మి పార్టీ శ్రేణులు వెంట రాగా రోడ్డుపై నడచివెళుతూ ప్రజలకు నమస్కరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కోరుకొని పోతుంది అనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు, దుగరాజపట్నం పోర్టు,విశాఖ ఉక్కు, రైల్వే జోన్,అమరావతి రాజధాని వంటి ఎన్నో అంశాలు విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్న తరుణంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడి తో కేంద్రం పై,పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతును అవుతాను అనీ ఆమె వెల్లడించారు, మీ బిడ్డగా,కోడలి గా ఒక్క అవకాశం ఇవ్వాలి అనీ ఆమె కోరారు,ఈ కార్యక్రమంలోటీడీపీ నాయకులుసుగుణమ్మ,పరసారత్నం, నరసింహయాదవ్‌, శ్రీధరవర్మ, మబ్బు దేవనారాయణరెడ్డి, డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం,  సూరా సుధాకర రెడ్డి, ఎన్‌బీ సుధాకర రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, కాయం వెంకటరత్నం, బ్యాంకు శాంతమ్మ, కుమారమ్మ, రావిళ్ల సుబ్బరాయులు నాయుడు, మధు, మన్నెం శ్రీనివాసులు, రుద్రకోటి సదాశివం, సుజాత తదితరులు పాల్గొన్నారు.

 681 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.