AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆరు అంకణాల స్థలం తో పాటు లైఫ్ జాకెట్లు పడవలు కూడా అందించండి…

1 min read

AAB NEWS : సొంత ఇల్లు లేని పేదలకు అందించే ఆరు అంకణాల స్థలాలతో పాటు తరచుగా వచ్చే వరదల్లో మునిగిపోయే భూములు కాబట్టి,ఇంటికొక పడవని,లైఫ్ జాకెట్లని కూడా పంపిణీ చేయాలని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పెన్నా నది పరివాహక ప్రాంతం భగత్ సింగ్ కాలనీలో పేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలను,అందరికి ఇళ్లు పథకం కింద ఇప్పటికే పూర్తి అయిన అపార్ట్మెంట్ భవనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ..
నివార్ తుఫాన్ బాధితుల కన్నా ఇరిగేషన్ శాఖ వైఫల్యాల బాధితులే ఎక్కువమంది ఉన్నారని,సొంత లాభాల కోసం, పేద ప్రజలకు అందించే ఇళ్ల స్థలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చిన్నపాటి వర్షానికే ఆరడుగుల లోతు నీళ్లు నిలబడే లోతట్టు ప్రాంతాలలో పేద ప్రజలకు భూములు కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు.
డబ్బు ఉన్న వాళ్లు, గొప్ప వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంటున్నపుడు, పేద ప్రజలకు ఇళ్లను మాత్రం చిన్న పాటి వరదకి కూడా మునిగిపోయే ప్రాంతాలలో కేటాయించడం చాలా బాధాకరమని ఆయన అన్నారు..గత ప్రభుత్వాల వైఫల్యం వలన ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయని,వాటిని చూసి కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చే ఇళ్లస్థలాలను కూడా లోతట్టు ప్రాంతాలలో కేటాయించడం వైసీపీ ప్రభుత్వ అవినీతికి,ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసమర్థతకు అద్దం పడుతోందని విమర్శించారు. అందరికీ ఇల్లు పథకం కింద గత ప్రభుత్వంలో పూర్తయిన అపార్ట్మెంట్ ఇళ్లకు ఇప్పుడు వైసీపీ పార్టీ జెండా రంగులు వేయడాన్ని కేతంరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు..ఒక వైపు కోర్టులు మొటిక్కాయలు వేస్తున్నా వైసీపీ నాయకుల తీరులో మార్పు రావట్లేదని అన్నారు..వైసీపీ రంగుల కొరత వల్లనే ఒకటిన్నర ఏడాదిగా పేదల కోసం కట్టిన ఇళ్లను అర్హులకు అందించలేదా అని కేతంరెడ్డి ప్రశ్నించారు.
కమీషన్ల మత్తులో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని,పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తరుపున ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటామని కేతంరెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,శ్రీకాంత్ యాదవ్,కుక్కా ప్రభాకర్,మోషే,హేమంత్,
రేవంత్,సురేష్,నాని, సదా,మహిళా నాయకులు షేక్ ఆలియా, శిరీషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 340 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.