AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు…

1 min read

AAB NEWS: అమరావతి: ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.2 కోట్ల నుంచి రూ.1.75 కోట్లకు తగ్గిందని అన్నారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిన తర్వాతే ఎలక్ట్రిక్‌ బస్సుల టెండర్‌పై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒక్కరికే టెండర్ కట్టబెట్టారని వస్తు్న్న ఆరోపణల్లో నిజం లేదని, అత్యంత పారదర్శకంగా  రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విధానం చేపడుతుందని చెప్పారు. ఈనెల 23 తర్వాత అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామన్నారు.మరోవైపు రాష్ట్రంలో అందరికీ సరిపడేలా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు కేటాయించాలని పేర్నినాని  కోరారు. వాక్సినేషన్ ప్రక్రియలో ఎపీని ప్రత్యేకంగా చూసి,  ఎక్కువ వాక్సిన్లు ఇవ్వాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిన్న ఒక్కరోజే  రాష్ట్రంలో అత్యధికంగా  13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు.కరోనాతో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా  ప్రస్తుతం అవసరమైన ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్‌ను సీఎం విడుదల చేశారని, చెప్పుడు మాటలను నిరుద్యోగ యువత  వినవద్దని కోరారు. సరిపడా ఉద్యోగ ప్రకటన రాలేదని  నిరుద్యోగులు  నిరుత్సాహ పడవద్దన్నారు.  రాబోయే 3 ఏళ్లలో నిరుద్యోగ యువతకు మంచి జరుగుతుందని…ముందుగా చెప్పినట్లుగా అన్ని ఖాళీ ఉద్యోగాలను సీఎం భర్తీ చేసి ఇచ్చిన హామీని నిలుపుకొంటారని అన్నారు. ఉద్యోగాలపై విమర్శలు చేస్తోన్న భాజపా నేతలు జాతీయ స్థాయిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

 962 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.