AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఉపాధి హామీ పథకం పనుల్లో తీవ్ర అస్వస్థకు గురైన మహిళ…

1 min read

AABNEWS కృష్ణా జిల్లా నాగాయలంక మండలం చోడవరం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ,ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్న మహిళ ఎండ తీవ్రతకు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో పక్కనే ఉన్న వారందరూ హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఏ పీ ఓ తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడు అంటున్న ఉపాధి హామీ కార్మికులుఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందు వలన చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు సమయాన్ని తగ్గించి తాము చేయవలసిన పని పూర్తి చేసుకొని వెళ్లే లాగా వెసులుబాటు కల్పించాలని ,
ఏ పీ ఓ ని కోరడంతో ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు పని చేయవలసిందేనని లేనియెడల పనికి రావాల్సిన అవసరం లేదు మానేయమని బెదిరిస్తున్నట్లు,
గతంలో మనిషికి 8 మీటర్లు టార్గెట్ గా ఇచ్చారని వాటిని ఉదయాన్నే ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పూర్తిచేసుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది .ఇప్పుడు ఆలా టార్గెట్లు కాకుండా సమయానుకూలంగా చేయవలసిందేనని బెదిరిస్తూ, కనీసం పనులు జరుగుతున్న ప్రాంతంలో మంచినీరు,
ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటి వసతులు కూడా కల్పించడం లేదని,,
ఇలా ఎవరైనా అస్వస్థతకు గురై ప్రాణాల మీదకు వచ్చిన, ఏదైనా విష సర్పాలు కరిచినా ఉపాధి హామీ కార్మికులు ప్రాణాలు ఇవ్వాల్సిందే తప్ప అధికారులు స్పందించడం లేదు, తమ గోడును చెప్పుకునేందుకు ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు, ఇప్పటికైనా అధికారులు స్పందించి గతంలో లాగా వారికి కేటాయించిన పనిని ఉదయం పూట అనుకూల సమయాలలో పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించి, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి పనిచేస్తున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ కార్మికులు కోరుకుంటున్నారు.

 546 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.