AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఊగిపోతున్న చంద్ర బాబు…

1 min read

AAB NEWS :

ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఓ ఫేక్ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. సీఎం వచ్చేదాకా శాసనసభను ప్రారంభించరా? అని ప్రశ్నించారు. సభా నియమాలకు విరుద్ధంగా ఆలస్యంగా మొదలుపెట్టడం దారుణమన్నారు.

పంచాయతీరాజ్ బిల్లుపై చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు. పంటనష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందన్న ఆయన… ఏడాదిలోనే లక్షా 25 వేల కోట్లు అప్పు చేశారని ఆక్షేపించారు. రామానాయుడును ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

తాను 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశానని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్న సీఎంను తొలిసారి చూస్తున్నానని చంద్రబాబు అన్నారు. సభలో వైకాపా నేతలు నీఛంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై చర్చిద్దామని ఎంత చెప్పినా వినిపించుకోలేదని చెప్పారు.

 120 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.