September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మార్పీయస్ ..ఒంగోలులో తీసుకున్న నిర్ణయం అమలు …

1 min read

AABNEWS : ఎమ్మార్పీయస్ ..ఒంగోలులో తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో విఫలమైన MRPS నాయకులు దైద మల్లేష్ ,బాలమర్తి సుధాకర్ పండు మాదిగలను MRPS ఉద్యమం నుండి శాశ్వతంగా తొలగించడమైందని MRPS జిల్లా అధ్యక్షుడు కోట డానియేలు మాదిగ తెలిపారు.ఉద్యమం పేరుతో వాళ్ళు ఎక్కడికి వెళ్లినా వాళ్ళ వ్యక్తిగతమే కానీ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదు. 26 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం చివరి దశలో కార్యాచరణ అమలు చేయకపోవటమే నిర్లక్ష్యంగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.5 నెలల కాలంలో ఒక్క రోజు కూడా తమ పాత్ర పోషించకపోవడం ఉద్యమంలో వుండి జాతికి ద్రోహం చేసిన వారయ్యారు. దానితో పాటు క్రమశిక్షణ లేని వ్యక్తులకు నాయకత్వం MRPS ఇవ్వదని తెలిపారు. ఈ రోజు నుండి ఒంగోలు లో తీసుకున్న నిర్ణయం సరిగా అమలు చేయని వారి పట్ల ఇదే వ్యవహార శైలి ఉంటుందని చెప్పారు.బావి తరాలకు వర్గీకరణ ఫలాలు దక్కాలంటే ఒంగోలులో తీసుకున్న నిర్ణయం అందరూ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు.MRPS సీనియర్ నాయకులు మారబత్తుల గోపాల్ మాదిగ,మండల అధ్యక్షులు కన్నెపొగు ప్రసన్న కుమార్ మాదిగ, మండల నాయకులు వేల్పుల రామకృష్ణ మాదిగ,మోదుగు కాటయ్య మాదిగ ,చిలుకూరు చిన రాములు మాదిగ, భాను మాదిగ తదితరులు పాల్గొన్నారు.

 280 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.