AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏపీలోని వాహనదారులకు శుభవార్తరవాణ శాఖ కీలక నిర్ణయం…

1 min read

AABNEWS ; కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. మోటారు వాహన పన్ను చెల్లింపు గడువును ప్రభుత్వం జూన్‌ 30 వరకు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రస్తుత త్రైమాసిక పన్నును ఏప్రిల్‌ 30వ తేదీలోగా చెల్లించాల్సి ఉంది. అయితే.. కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో పన్ను చెల్లింపు గడువును పొడిగించాలని లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. వీరి వినతి పట్ల సానుకులంగా స్పందించిన సర్కార్ పన్ను చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ కన్నబాబు సోమవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లారీ యజమానుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. వాస్తవానికి వెహికల్ టాక్స్ అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ మూడు నెలలు ఒక సారి ఈ చెల్లింపులు ఉంటాయి. గడువులోగా వెహికిల్ ట్యాక్స్ చెల్లించని పక్షంలో భారీగా జరిమానా విధిస్తారు. అయితే ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఎలాంటి ఫైన్ లేకుండానే వారు రెండు నెలల తర్వాత పన్ను చెల్లించే అవకాశం ఏర్పడింది.కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి మే నెల చివరి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లను నిలిపివేసింది. ఈ మేరకు రవాణ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి జూన్ 1 వ తేదీ తర్వాత వేరే తేదీల్లో అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పేదలకు 10 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే, జూన్ రెండు నెలల పాటు ఉచితంగా బియ్యం అందించనుంది. కేంద్రం ప్రభుత్వం ఇచ్చే 5 కేజీల బియ్యానికి అదనంగా మరో 5 కేజీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో మొత్తం 1.47 కోట్ల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం మొత్తం 88 లక్షల మందికే ఉచిత రేషన్ ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 59 లక్షల మందికి కూడా ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వనుంది.

 563 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.