AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

AAB NEWS : నివర్ తుపాను తీరం దాటిపోవడంతో ముప్పు తప్పిందని చెప్పారు అధికారులు. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు బాగా కురుస్తూ ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని మామళ్లపురం-కరెైకల్‌ మధ్య తీరం దాటిన నివర్‌ తుపాను ఏపీపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారిపోయింది. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.  ఓవైపు భారీవర్షాలు పడుతున్నా చలిగాలులు కూడా వీస్తున్నాయి. జనం బయటికి రావడానికి జంకుతూ ఉన్నారు. తుపాను తీరం దాటినా బలహీన పడే క్రమంలో వర్షాలు, చలిగాలులు తప్పవని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే మత్సకారులను వేటకు వెళ్లడాన్ని నిషేధించారు. స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నారు.

 160 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.