AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏపీలో పెరిగిన రేషన్ సరుకుల ధరలు…

1 min read

AAB NEWS : తాజాగా పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు సముఖంగా ఉండరేమోనని రేషన్ డీలర్లు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో దీనికంటే రూ. 20, 30లు తేడా మాత్రమే ఉందంటున్నారు.
ఏపీలో డిసెంబర్ నుంచి రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. కార్డులో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో పంచదార ఇవ్వనున్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు ఇప్పటి వరకు కిలో రూ. 40లు ఉంటే.. రూ. 27 పెరిగి రూ. 67 అయ్యింది. చక్కెర ధర స్వల్పంగా పెరిగి అరకిలో రూ.17కు చేరింది. నాలుగు నెలల క్రితమే ఈ ధరలు పెరిగినా కరోనా కారణంగా ఇప్పటివరకు ఉచిత పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ నెల నుంచి ఈ సరుకులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

పెరిగిన రేషన్ సరకుల ధరల
వినియోగదారులు కిలో కందిపప్పు రూ. 67, చక్కెర అరకిలో రూ. 17, బియ్యానికి కిలో రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. బియ్యం కిలో రూపాయికే ఇస్తున్నప్పటికీ కందిపప్పు, చక్కెర రేట్లు పెరిగినట్లు లెక్క. తాజాగా పెరిగిన ధరలతో కందిపప్పు కొనేందుకు లబ్ధిదారులు సముఖంగా ఉండరేమోనని రేషన్ డీలర్లు అంటున్నారు. బహిరంగ మార్కెట్లో దీనికంటే రూ. 20, 30లు తేడా మాత్రమే ఉందని.. రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు నాణ్యత అంతంత మాత్రమే అని కార్డుదారులు అంటున్నారు

 160 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.