AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు…

1 min read

AAB NEWS : సడలింపు.అమరావతి: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తించనున్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో సడలిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఏపీలో రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేయనున్నారు. 8 జిల్లాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఇక ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి.

 3,301 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.