AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఐఅండ్‌పీఆర్ జర్నలిస్టుల పక్షం…

1 min read

AABNEWS : న్యాయ సమస్యలు తొలగిన వెంటనే అక్రిడిటేషన్లు ఎన్.ఎ.ఆర్.ఎ. అధ్యక్షుడి వినతికి సానుకూలంగా స్పందించిన సీఐపీఆర్ విజయవాడ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ (సీఐపీఆర్),సీనియర్ ఐఐఎస్ అధికారి తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రబాబు బండి శుక్రవారం సీఐపీఆర్ విజయ్‌కుమార్‌రెడ్డి ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని వినతి పత్రం సమర్పించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులను,వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆదుకోవాలని తమతో పాటు వివిధ సంఘాలు ఇచ్చిన వినతుల పట్ల స్పందించిన సమాచార,పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ కొంత వరకు ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపించడం పట్ల సీఐపీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన సురేంద్రబాబు అనంతరం పాత్రికేయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటైన అక్రిడిటేషన్ల అంశాన్ని ప్రస్తావించడంతో దీనిపై సానుకూలంగా స్పందించిన విజయ్‌కుమార్ రెడ్డి ఆ సమస్య ప్రస్తుతానికి కోర్టులో ఉండడం వల్ల శాఖాపరంగా తాము ముందుకు వెళ్లలేని పరిస్థితి ఎదురైందని ఆవేదన వెలిబుచ్చారు. తమ శాఖ ఎప్పటికీ వర్కింగ్ జర్నలిస్టుల పక్షాన నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం తమ ముఖ్య ఉద్దేశాలనీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.న్యాయపరమైన సమస్యలు తీరిన వెంటనే అర్హులందరికీ అక్రిడిటేషన్లు జారీచేస్తామని హామీ ఇచ్చిన సీఐపీఆర్,ఈ విషయంలో ప్రభుత్వం కూడా తమ శాఖకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు.జర్నలిస్టులను ఇతోధికంగా ఆదుకోవడం,వారికి ఆర్ధిక ఆసరా,భవిష్యత్తుపై భరోసా కల్పించడం గురించి చేసిన విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆయా సమస్యలపై కూడా దృష్టిసారిస్తామన్నారు. కరోనా మహమ్మారి విపత్తు నేపథ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన జర్నలిస్టుల జీవితాలు,వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితుల గురించి, జర్నలిస్టులపై ఇటీవల కాలంలో జరుగుతున్న దాడుల అంశాన్నీ సీఐపీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని విజయ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని సురేంద్రబాబు తెలిపారు. శాఖాపరంగా ఇప్పటికే ఆయన తన వంతు సహకారాన్ని చాలా వరకు అందించారని, కష్టకాలంలో,ఆరోగ్య అత్యయిక పరిస్థితి (హెల్త్‌ ఎమర్జెన్సీ) లో సైతం ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్య బీమా పాలసీని పునరుద్దరించేలా వత్తిడి తీసుకువచ్చారనీ చెప్పారు. కరోనా విపత్కర సమయంలో సమాచార శాఖ చొరవ తీసుకుని మీడియా మిత్రులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ రెన్యూవల్ చేయించేలా చూశారు. దీనికి మా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ.) తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాము. అతి తక్కువ (కేవలం ఏడాదికి 198 రూపాయల) ప్రీమియంతో ప్రభుత్వం గతంలో అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేసే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం జర్నలిస్టుల ప్రమాద బీమా (10 లక్షల ఇన్స్యూరెన్స్) ను పునరుద్దరించడంలో జాప్యం జరిగిందన్న అంశాన్ని సీఐపీఆర్ దృష్టికి తీసుకువెళ్లాము. జర్నలిస్టులకు భరోసా కల్పించాలని,విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మీడియా మిత్రులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చి ఆయా కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ఆర్ధిక భద్రత,బీమా,ఉచిత వైద్య సదుపాయాలను కల్పించాలని కోరినప్పటికీ అనివార్య కారణాలు, ప్రభుత్వపరమైన సమస్యల నేపథ్యంలో ఆయా అంశాలు అమలులోకి రాలేదు.ఆ విషయాన్నీ ఆయనతో చర్చించడం జరిగింది. కరోనావైరస్ కష్టాలు మీడియా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాయన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రికేయుల ప్రయోజనాలను కాపాడడంలో ఆయన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధుల జీవితాలకు రక్షణ లేదన్న విషయం మరోసారి విజ్ఞులైన ఆయన దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.’’ అని సురేంద్రబాబు చెప్పారు. సహజంగా ప్రతి పాత్రికేయుడు విధి నిర్వహణలో ముందుండాలని, తాను పనిచేస్తున్న సంస్థ ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారాన్ని ముందుగా వార్తల రూపంలో అందించాలనే ఉద్దేశంతో పని చేస్తూ ఉంటారు.ఇదే క్రమంలో అనేకమంది మిత్రులు ప్రాణాంతకమని తెలిసినా రిస్క్ ఫేస్ చేస్తున్నారు. కరోనా వారియర్స్ (వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, పోలీసులు,పారిశుధ్య కార్మికుల) జాబితాలో మీడియా ప్రతినిధులను చేర్చకపోవడం వల్ల జరిగిన నష్టం ఎలా ఉంటుందో మీడియా ప్రతినిధుల మరణాలను చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత కొంత వరకు తగ్గినా నష్టపోయిన మిత్రుల కుటుంబాలకు న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది.విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల చాలా ఇబ్బందులు పడ్డారు.పనిచేస్తే తప్ప రోజుగడవని పరిస్థితిలో ఉన్న పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ కరోనా విపత్తు న్యూస్ కవరేజీ విధులు నిర్వహించారు.తాజాగా ఇప్పుడు అక్రిడిటేషన్ల సమస్య వచ్చిన నేపథ్యంలో వారంతా ఆందోళన చెందుతున్నారు.’’ అని సురేంద్రబాబు పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న గుర్తింపు, ఆరోగ్య బీమా,వ్యక్తిగత ప్రమాద బీమా కార్డుల జారీ,ఇళ్ల స్థలాల మంజూరు తదితర క్షేత్రస్థాయి సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వత్తిడి చేస్తూ మా సంఘం తరపున మేము కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం జరిగింది.కరోనా ఆర్ధిక కష్టాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు ఆర్ధిక భరోసా కల్పించడంతో పాటు వివిధ వర్గాలను ప్రోత్సహిస్తున్న మాదిరిగానే మీడియా రంగాన్ని కూడా ఆదుకునేలా ప్రభుత్వంపై వత్తిడి పెంచాలి.ఈ సమస్యల పరిష్కారంపై మీడియా మిత్రులంతా యూనియన్‌లకు అతీతంగా కలిసి వచ్చి,తమవంతు పాత్ర పోషించి అండగా నిలుస్తారని కోరుతున్నాను.’’ అని సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

 448 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.