ఒంటి గంట వరకే అనుమతి ఎస్పీ…
1 min read
AABNEWS : నూతన సంవత్సర వేడుకలను ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఎస్పీ నారాయణనాయక్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దన్నారు. డిసెంబరు 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతి ఉందన్నారు. ఓపెన్ పార్టీలు, రెస్టారెంట్ల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా ఎవరికి వారు ఇళ్ల వద్దనే వేడుకలు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా యువత రోడ్ల పైకి వచ్చి హడావుడి చేస్తే చర్యలు తప్పవన్నారు. తాను ఏటా నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్యే నిర్వహించుకుంటానని తెలిపారు.
33 Total Views, 2 Views Today