AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కంట్రోల్‌ రూంల ద్వారా కరోనా బాధితులకు భరోసా…

1 min read

AAB NEWS : కోవిడ్ సోకిన వారు ఇంటి వద్దే ఉండండి , మీకు ఏ అవసరమున్న మాకు కాల్ చేయండి .కోవిడ్ రోగులను మానిటరింగ్ చేయడం ద్వారా కరోనా కట్టడికై కోవిడ్ కంట్రోల్ సెంటర్(+918331940638) :రామగుండం వలయాధికారి శ్రీ కణతల లక్ష్మీనారాయణ.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ ఐపీఎస్ గారి సూచనమేరకు ఎన్ టి పి సి ఎస్ ఐ ఎన్ స్వరూప్ రాజుగారు covid-19 కంట్రోల్ సెంటర్ (+918331940638) నీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం వలయాధికారి అయిన శ్రీ కణతల లక్ష్మీనారాయణ గారు హాజరై, వారు మాట్లాడుతూ కోవిడ్ రోగులను మానిటరింగ్ చేయడం ద్వారా కరోనా కట్టడి సాధ్యం అవుతుందని అన్నారు.దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. లక్షణాలు లేనప్పటికీ కొంతమందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. ఈ కారణంగా రోజుకు చాలా సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో, కరోనా నిర్ధారణ అయిన చాలా మంది రోగులు తమ ఇళ్లలో స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. అయినప్పటికీ చాలా మంది కరోనా రోగులకు రోజువారీ అవసరాల నిమిత్తం తప్పనిసరి పరిస్థితులలో బయటికి వస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ఎట్టిపరిస్థితుల్లో బయటకు రాకుండా కట్టడి చేసి వారి అవసరాలను తీర్చే విధంగా ఈ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తెలియజేయడం జరిగింది.
దీనిలో భాగంగా ప్రతి 30 మంది కరోనా రోగులకు ఒక కానిస్టేబుల్ ఆఫీసర్ ను నియమించి,రోగులను ప్రతి రోజూ రెండు సార్లు ఫోన్ ద్వారా సంప్రదించి వారి బాగోగులు మరియు అవసరాల గురించి తెలుసుకొని వాటిని తీర్చుటకు మా వంతు కృషి చేస్తామని పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేశారు.అదేవిధంగా పాజిటివ్ గా నిర్ధారణ అయినవారు బయటకి వచ్చినట్టు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారు బయటకు వచ్చినట్లు తెలిస్తే ఎవరైనా మాకు సమాచారం అందించగలరని ప్రజలకు ఎన్టీపీసీ పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది.

 227 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.