AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్…

1 min read

AABNEWS : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం మూడు గటంలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరతారు. ఐదు గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయం నుంచి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. రాత్రికి సీఎమ్‌ అక్కడే బస చేసి రెండో రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం రెండు గంటల పాటు చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లోనూ సీఎమ్‌ జగన్‌ పాల్గొననున్నారు. భోజన విరామం తర్వాత పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. అక్కడ ఏపీఎస్‌ ఆర్టీసీ బస్టాండు, బస్సుడిపో, ఇతర అభివృద్ధి పనులకు సీఎమ్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారు. మూడు గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్‌కు చేరుకుంటారు. ఇమ్రా ఏపీకి శంకుస్థాపన చేస్తారు. నాలుగు గంటలకు అపాచీ లెదర్‌ డెవలప్‌మెంట్‌ పార్కుకు శంకుస్థాపన చేసి, ఐదు గంటల ప్రాంతంలో తిరిగి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. మరొసటి రోజు ఉదయం పది నుంచి 11 గంటల వరకు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎమ్‌ పాల్గొంటారు. అనంతరం పన్నెండు గంటల ప్రాంతంలో కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళతారు.

 96 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.