AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కులాల వారీగా వేతనాల రద్దు చేయాలి…

1 min read

AABNEWS : కులాల వారీగా వేతనాల రద్దు చేయాలి. రైల్వేకోడూరులో రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష కార్మిక నేతల డిమాండ్!జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధిలో పని చేస్తున్నా కూలీలను ఎస్సీ ఎస్టీ   ఇతర కులాల వారీగా ను  విభజన చేసి వేతనాలు ఇవ్వాలని కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది. తక్షణం రద్దు చేయాలని కడప జిల్లా రైల్వే కోడూరు  ఎన్జీవో హోం లో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు, పంది  కాళ్ళ మణి  స్వాగతోపన్యాసం ఇచ్చారు,  జిల్లా నాయకులు, ఎస్ చెన్నయ్య, సభాధ్యక్షులుగా  నిర్వహించారు., వామపక్ష వ్యవసాయ కార్మిక   సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, వామపక్షాల మద్దతుతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ పథకాన్ని ఎత్తివేసే దానికి  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, కుట్రపన్నుతోందని  కూలీల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు, బడ్జెట్ లో 50 శాతం కోత  విధించారని, భాగంగా వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని  ఆందోళన వ్యక్తం చేశారు. నేటి  కరోనా పరిస్థితిలో కూలీలకు ఎంతో   ఉపయోగపడుతుందన్నారు, వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం అనుబంధ, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా మాట్లాడుతూ, కులాల వారిగా విభజించడం  వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒకే దేశం ఒకే పన్ను చెప్పే బిజెపి ప్రభుత్వం, పులి లో కులాల వారీగా  వేతనాలు ఇవ్వడం ఏమిటని  ప్రశ్నించారు. ఉపాధి పని దినాలు 200 రోజుల పెంచాలని, రోజు కూలీ 600 ఇవ్వాలని  పట్టణాలకు విస్తరించాలని, కేరళ  మాధురి 18 రకాల నిత్యవసర వస్తువులు ఇవ్వాలని,  క రోనా మృతులకు  5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఉపాధి కూలీ మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, ఉపాధి కూలీ అంగవైకల్యం చెందితే ఐదు లక్షలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు  అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.  సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం  మాట్లాడుతూ, దళితులు గిరిజనులు బీసీలు ఓసీలు అని కూలీల మధ్య వివక్షత పాటించడం సరికాదన్నారు. కనీస వేతనం 245 రూపాయలు ఎక్కడా పడటం లేదన్నారు. ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుని, కూలీలు సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 7500 నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19న జరిగే కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ను జయప్రదం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సుధాకర్ గారూ, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్  ఓబిలి పెంచలయ్య, ఓబులవారిపల్లి  సిపిఎం,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం .జయరామయ్య,  నరసింహులు,రైతు సంఘం నాయకులు, లింగాల యానాదయ్య, వెంకట్ రెడ్డి, ఎర్ర సుబ్రహ్మణ్యం, కోడూరు, సిఐటియు నాయకులు సుబ్రమణ్యం రాజు, సి ఐ టి యు,  ఓబులవారిపల్లి, మండల కన్వీనర్, దార్ల సుధాకర్, పుల్లంపేట సిఐటియు నాయకులు, దార్ల నాగేశ్వరరావు, రాజు, చిట్వేలు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లారపు కృష్ణయ్య, సిఐటియు నాయకులు, మల్లారపు   చిన్న,  సిపిఐ  వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, జ్యోతి చెన్నయ్య,  పాశం ప్రసాద్, రాజశేఖర్,  ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు,  సి ఐ టి యు అనుబంధం అధ్యక్షులు, సి ముని చంద్ర రాజు తదితరులు. పాల్గొన్నారు.

 57 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.