AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నాయకుల ఆందోళన…

1 min read

AAB NEWS : ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు ఎన్‌జీవోకాలనీ (కడప), న్యూస్‌టుడే : కర్షకుల కడుపు కొట్టి కార్పొరేట్ల కడుపు నింపాలని చూస్తున్న ప్రధాని మోదీ పతనం కాయమని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు జి.ఈశ్వరయ్య, బి.నారాయణ, గాలిచంద్ర, దస్తగిరిరెడ్డి, శివారెడ్డి, వెంకటశివ, బషిరున్సిసా, కేసీీ బాదుల్లా, శ్రీనివాసులరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా జిల్లాలోని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు కడప నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు డాక్టరు స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నమ్మబలికిన భాజపా అధికారంలోకి వచ్చాక ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు టి.మనోహర్‌రెడ్డి, బాలచంద్రయ్య, మేకల జయన్న, అన్వేష్‌, పాపిరెడ్డి, చంద్రారెడ్డి, వలరాజు, ఓటులేషు, మల్లికార్జున, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

 165 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.