AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాయలసీమకు తీవ్ర అన్యాయం…

1 min read

AAB NEWS : కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మీ నరసింహ కళ్యాణమండపం ఆవరణం నందు అఖిలపక్ష రైతు సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం మలిశెట్టి నితిన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ. మిగులు జలాలు వాడుకునే హక్కు వెనుకబడిన రాయలసీమ కే ఉందన్నారు. రాయలసీమకు ఉన్న సాగునీటి ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ మాత్రమే అన్నారు. వరద జలాలను పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. దీన్ని రాజకీయం కోసం కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 170 జీవో ద్వారా 11500 క్యూసెక్కుల నుండి 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. తెలుగు గంగ బ్రహ్మంసాగర్ గాలేరు-నగరి హంద్రీనీవా వెలుగోడు మద్రాసు తాగునీటికి ఇదే ఆధారం అన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలను పోలవరం ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కోస్తా ప్రాంతం 80 టీఎంసీల దాకా వాడుకుంటోందని ఆ మేరకు రాయలసీమ కు నికర జలాలు కేటాయించాలన్నారు. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ఆల్మట్టి డ్యాములు ఎత్తు పెంచడం ద్వారా దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి ఉమ్మడి రాష్ట్రాలు కేంద్రం పైన పోరాడి ఆపు చేయించాలన్నారు .శ్రీశైలం ప్రాజెక్టు ను 1984 లోనే ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు అఖిలపక్ష సమావేశం నిర్వహించి శ్రీశైలం ప్రాజెక్టు ను సాగునీటి ప్రాజెక్టుగా ప్రకటించారు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణపై 1996 జనవరి15న తీసుకువచ్చిన జీవో నెంబర్ 69 ప్రకారం శ్రీశైలం కనీస నీటి మట్టం 834 అడుగులు, మరియు 2004 సెప్టెంబర్ 28న తీసుకువచ్చిన జీవో నెంబర్ 107 ప్రకారం శ్రీశైలం కనీస నీటి మట్టం 854 అడుగులు ఉల్లంఘిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా నీటిని వదలడం రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్నారు. ఇంత జరుగుతున్నా కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చేసిన చట్టాలను లెక్కచేయకుండా, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన నీటి వివాదాలపై సెక్షన్ 89 కి విరుద్ధంగా కృష్ణా నది మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చినట్లు తెలంగాణ మంత్రులు మాట్లాడటం బాధ్యతారాహిత్యం అన్నారు. నీళ్లు జాతీయ సంపద అన్నారు. కరెంటును కొనుక్కోగలం కానీ నీళ్లను కొనగలమా అన్నారు. సముద్రంలో కలిసిన నీళ్లలో ఒక్క చుక్క కుడా వెనక్కి రాదన్నారు.నాగర్జున ఆయకట్టు అవసరాలకు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని దిగువకు వధ లాలన్నారు. తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తిపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖలతో సరిపెట్టుకుంటే కుదరదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో గానీ వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించే విషయంలో తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కూడా కేవలం తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన ఉత్తరం ఆధారంగా పనులు నిలుపుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారన్నారు. అలాంటి వీరు ఏపీ ఉత్తరాలను పరిగణలోకి తీసుకొని విద్యుత్తు ఉత్పత్తిని ఆపిస్థారన్న నమ్మకం లేదు అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ప్రత్యక్ష ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణలో కూడా ఏపీ ప్రజలు ఉన్నారని ముఖ్యమంత్రి ప్రకటించడం సహేతుకం కాదని, హైదరాబాదు ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. కరువు పీడిత రాయలసీమ విముక్తికై నిధులు, నికర జలాలు సాధన కోసం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కోసం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కోసం, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా దశలవారీ పోరాటానికి సమాయత్తం కావాలన్నారు .
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా రాయలసీమ ఎత్తిపోతల కన్వీనర్ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి ,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర,రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ పి శివారెడ్డి, రైతు సంఘం నాయకులు మలిశెట్టి రాహుల్ తెలుగు దేశం పార్టీ నాయకులు కృష్ణమనాయుడు డు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు ఎస్ శంకరయ్య జనసేన రాష్ట్ర నాయకులు తాతం శెట్టి నాగేంద్ర . జనసేన యువజన నాయకులు మరి రెడ్డి ప్రసాద్ ,సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ చెన్నయ్య, సిపిఐ ఓబులవారిపల్లి నాయకులు జ్యోతి చిన్నయ్య. తదితరులు పాల్గొన్నారు తెలంగాణ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23న కోడూరు లో నిరసన తెలియజేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించడమైనది

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.