AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వారి వేతనాలు ఇవ్వడాన్ని రద్దు చేయాలనిజయప్రదం చేయండి…

1 min read

AAB NEWS : ఉపాధి హామీ లో కులాల వారి వేతనాలు ఇవ్వడాన్ని రద్దు చేయాలని , 19న కలెక్టర్ ఆఫీస్ వద్ద,  ధర్నా ను జయప్రదం చేయండి కేంద్ర ప్రభుత్వం , వ్యవసాయ కూలీలు, దళితుల పట్ల,అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా, కడప కలెక్టర్ ఆఫీస్ వద్ద 19 న సోమవారం జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోడూరు విలేకరుల సమావేశంలో సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పంది కాళ్ళ మణి, సి గే, చెన్నయ్య,  కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్,   ఓబిలి పెంచలయ్య,  సి ఐ టి యు  నాయకులు దార్ల నాగేశ్వరరావు తదితరులు  పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ పథకంలో కులాల వారిగా వేతనాలు ఇవ్వడాన్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు, 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం కరోనా లో నెలకు 10,000 ఇవ్వాలని, అదేవిధంగా  18 రకాల నిత్యవసర సరుకులు సరఫరా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కూలీలకు భూమి పంపిణీ చేయాలని, డిమాండ్ చేశారు.  ఉపాధి కూలీలు మృతి చెందిన వారికి 10 లక్షలు, అంగవైకల్యం చెందిన వారికి ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి అన్నారు.  కరోనా లోచనిపోయినవారికి ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, దళితులకే ఖర్చు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు,  దళిత సంఘాలు , గిరిజన సంఘాలు పిలుపుమేరకు19న జరిగే ధర్నాను జయప్రదం  చేయాలని పిలుపునిచ్చారు. సి ఐ టి యు వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

 139 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.