AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సి ఐ టి కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్…

1 min read

AAB NEWS ; ఏపీఎండీసీ ని దివాలా తీస్తున్న యాజమాన్యం!సిఐటియు జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ విమర్శ!ఏపీఎండీసీ సంస్థను యాజమాన్యం అవలంబిస్తున్న విధానాల వల్ల దివాలా  తీయించి ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారని, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు,  సి ఐ టి యు కడప జిల్లా కార్యదర్శి మంగళవారం విలేకర్ల సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. వచ్చిన ప్రతి ఎం డి , పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు,  అనుకూలంగా  నిర్ణయాలు చేస్తూ, సంస్థను నష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం, 100 కోట్లు విరాళం ఇచ్చి, నేడు రెండు వందల కోట్లు అప్పు తేవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటిదాకా కార్మికులు కార్మిక సంఘాలు, కృషి పోరాట ఫలితంగా లాభాల్లో నడిపారని,  నేడు నష్టాలు చూపించి, ప్రైవేటుపరం  చేయడానికి  కుట్ర పన్నుతున్నారని
ఉద్యోగులు కార్మికులు ప్రజలు గుర్తించాలని హెచ్చరించారు. సమస్త నష్టాలు రావడానికి ఏపీఎండీసీ అధికారుల అవినీతికి ప్రధాన కారణమన్నారు. ఏపీఎండీసీ మంగంపేట  బరైటీస్ నిధులను, ఇతర సంస్థలకు దారాదత్తం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ కు 200 కోట్లు, ఫైబర్ నెట్ కి 100 కోట్లు, బేవరేజ్  కంపెనీకి 100 కోట్లు,  కడప  స్టీల్ ప్లాంట్ కు 50 కోట్లు, కోల్ బ్లాకు 800 కోట్లు,  ఇసుక లో పెట్టిన పెట్టుబడి రాక 180 కోట్లు నష్టాలు  చూపారు అన్నారు. నాడు నేడు ఇసుక డబ్బులు రాలేదన్నారు, 60 కోట్లు ఎండి మధుసూదన్ రెడ్డి సీసీ కెమెరాలు కాంట్రాక్టరుతో కుమ్మక్కై, బిగించ కుండానే స్వాహా చేశారన్నారు.  అంతర్జాతీయంగా   బెరైటీస్ కు ధర లేదంటూనే,  లోపాయికారి ఒప్పందంతో,  త్రివేణి ఎర్త్   మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, 2580, కోట్లకు, ఐదు సంవత్సరాలకు, గనితవ్వకాల  కాంట్రాక్టు అప్పగించారు.   బరైటీస్ సేల్స్ లేనప్పుడు, ఇంత తీయడం అవసరమా  అనీ ప్రశ్నించారు. తీసిన   బెరైటీస్  రాయని  ఖాళీ   చెక్కుల తో, వ్యాపారస్తులకు  అప్పులిచ్చి  ఎగ్గొట్టిన  ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ,తెస్తున్న అప్పులు లోన్లుకు, వడ్డీ కట్టలేక, దివాలా తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఏపీఎండీసీ ని నష్టాల పాలు చేసి, ప్రైవేటు వారికి అమ్మకానికి పెడుతున్నారని, హెచ్చరించారు. ఎం డి వో లకు, కట్టబెట్టడాన్ని, కార్మిక సంఘాలు వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, వాయిదా వేసి, కొత్త  పద్ధతుల్లో, ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని, అందులో భాగమే డి వాటరింగ్, పనులు, ప్రైవేటు వారికి టెండర్లు పిలిచారు అన్నారు. కష్టపడే కార్మికులకు మాత్రం, పోరాడి సాధించుకున్న, బోనస్సు లో కోత  విధించారు,  న్యూ ఇయర్ గిఫ్ట్ లో కోత విధించారని, సమాన పనికి సమాన వేతనం  కానీ. అవుట్సోర్స్ ట్రైనింగ్  కార్మికుల రెగ్యులర్ కానీ ప్రస్తావనే లేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా,  ఉద్యోగ భద్రత రెగ్యులర్ రేషన్ కోసం, పోరాడాలని పిలుపునిచ్చారు. లేకుంటే  ఇసుకను ప్రైవేటు వారికి కట్టబెట్టి  2000 మంది ఉద్యోగుల తొలగించినట్లు, ఏపీఎండీసీ లో కూడా ప్రవేట్ పరం చేసి ఉద్యోగాలు తొలగిస్తారు, జాగ్రత్తగా ఐక్యంగా పోరాడాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

 106 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.