AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అక్రమ కేసును ఎత్తి వేయాలి…

1 min read

AABNEWS : స్టాఫ్ రిపోర్టర్ టి జి ప్రసాద్ పై బనాయించిన అక్రమ కేసును ఎత్తి వేయాలి.. గోరంట్ల శకుంతల కర్నూలు.. 10 టి వి స్టాఫ్ రిపోర్టర్ టి జి ప్రసాద్ పై బనాయించిన అక్రమ కేసును ఎత్తి వేయాలని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి వై ఎస్ ఆర్ సిపీ కర్నూలు నగర నాయకురాలు గోరంట్ల శకుంతల శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కర్నూలు నగరం లోని ఓ మైనర్ బాలిక పైన జరిగిన అత్యాచారం సంఘటన గురించి 10 టి విలో ప్రసారం చేశారానే సాకుతో రిపోర్టర్ పైన పొక్స్ కేసు నమోదు చేయడం పోలీసు చర్యలకు అద్దం పడుతుందాన్నారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను వెలికి తీసి వెలుగు చూపే జర్నలిస్టులపైన, జర్నలిస్టు వ్యవస్థ పైన ఇలా కేసులు బనాయించుకుంటూ పోతే సమాజంలో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియకుండా పోతుందని, వ్యవస్థ చీకటి మాయం అవుతుందని ఆమె అప్రకటనలో పేర్కొన్నారు. రిపోర్టర్ టి జి ప్రసాద్ పై పెట్టిన కేసును తక్షణమే ఎత్తి వేయాలని ఆమె డిమాండ్ చేశారు.

 158 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.