AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అనాధ గర్భిణి ని భర్త తల్లితండ్రులకి అప్పగింత…

1 min read

AABNEWS: అనాధ గర్భిణి ని భర్త తల్లితండ్రికి అప్పగింత..
గోరంట్ల శకుంతల…
కర్నూలు నగరం లోని స్థానిక అశోక్ నగర్ లో రాయలసీమ మహిళ సంఘ్ ఆద్వర్యం లో నడపబడుచున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహం లో గత 6 నెలల నుంచి అనాదగా నిరా శ్రయం పొందుతున్న చైతన్య అను గర్భిణీ మహిళను ఆ మహిళ భర్త, తల్లి తండ్రుల కు అప్పగించినట్లు రాయలసీమ మహిళ సంఘ్ అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల తెలిపారు.ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ మా రాయలసీమ మహిళ సంఘ్ అద్వర్యం లో నడపబడుచున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహానికి గత 6 నెలల క్రితం చైతన్య అనే యవతి రావడం తో ఇక్కడ ఆశ్రయం కల్పించడం జరిగింది అన్నారు.నిరాశ్రయ వసతి గృహన్ని కీవచ్చిన యువతి గర్భిణి కావడం తో గత కొన్ని రోజుల క్రితమే ఆ గర్భిణికి ఘనంగా శ్రీమంతం కూడా మా రాయలసీమ మహిళ సంఘ్ అద్వర్యం లో ఘనంగా జరపడం జరిగింది అన్నారు. ఈ విషయాన్ని పత్రికల్లో వచ్చిన వార్త ద్వారా తెలుసు కున్న గర్భిణి చైతన్య భర్త,తల్లి తండ్రులు రావడం తో వారికి కౌన్సెలింగ్ చేసి గర్భిణి చైతన్యను వారి కి అప్పగించా మని గోరంట్ల శకుంతల తెలిపారు..ఈ కార్యక్రమంలో వసతి గృహ మేనేజర్ యామిని, కేర్ టెకేర్ లతశ్రీ, నిరా శ్రయా మహిళలు ఉన్నారు.

 164 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.