కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆర్టీసీ…
1 min read
AABNEWS : సంక్రాంతి దగ్గర పడుతున్నకొద్దీ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసేది. బస్సులకు నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ల హడావుడి ఉండేది. ఆన్లైన్లో దూర ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలో సీట్లు నిండిపోయేవి. ఇది గతంలోని మాట.. కరోనా నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముందస్తు రిజర్వేషన్లు ఆశించిన స్థాయిలో కానరావడం లేదు. కొవిడ్ ప్రభావం నుంచి జనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఈ ప్రభావం మొత్తం ఆర్టీసీపై పడింది. కర్నూలు జిల్లాలో మొత్తం 12 డిపోలు ఉన్నాయి. సంక్రాంతి నేపథ్యంలో 251 ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటుచేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు 160, చెన్నై-6, బెంగళూరు-45, విజయవాడ-40 బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రయాణికుల నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉండటంతో ఇవి పూర్తిస్థాయిలో నడపాలా? లేదా? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ అంటేనే ఆర్టీసీకి పెద్దఎత్తున ఆదాయం వచ్చేది. ప్రత్యేక బస్సులను పెద్దఎత్తున నడపడం ద్వారా ఖజానా కళకళలాడేది. గతేడాది సంక్రాంతికి 561 బస్సులు ఏర్పాటు చేశారు. సంక్రాంతికి ముందు 314, తర్వాత 247 బస్సులు వేశారు. హైదరాబాద్‌కు అధికంగా 334 బస్సులు నడిపారు. తద్వారా రూ.1.40 కోట్ల రాబడి వచ్చింది. ఉపాధి కరవై..: కరోనా నేపథ్యంలో చాలామందికి ఉపాధి లేకపోవడంతో సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మరోవైపు పండగకు చాలామంది స్టాఫ్‌వేర్ ఇంజినీర్లు వస్తుంటారు. ప్రస్తుతం అధిక శాతం మంది ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ ప్రభావం ఆర్టీసీపై పడింది. కొవిడ్ నేపథ్యంలో చాలామంది స్వగ్రామాలకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరికొందరు సొంతంగా వాహనాలు సమకూర్చుకుంటుండటం.. అద్దె వాహనాలు తీసుకొని వెళుతున్నారు. కరోనా రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన నేపథ్యంలో చాలామంది ఇళ్లకే పరిమితమవుతున్నారు
215 Total Views, 2 Views Today