కర్నూలు ఆర్టీసీ అదరహో…
1 min read
AABNEWS : జిల్లాలో ఆర్టీసీ వేగం పుంజుకుంటోంది. లాక్డౌన్ అనంతరం క్రమంగా బస్సులు పెరగడంతోపాటు రాబడి వృద్ధి చెందింది. మే నెలలో 49 శాతమున్న ఆక్యుపెన్సీ రెషియో(ఓఆర్) డిసెంబరు తొలివారంలో 76 శాతానికి చేరుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకోవడంతోపాటు ఉద్యోగులు ఉత్సాహంగా విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 667 బస్సులకు 550 వరకు తిరుగుతున్నాయి. గతంలో కరోనా ప్రభావంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఎక్కేందుకు ఆసక్తి చూపలేదు. ఆగస్టు నుంచి బస్సుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీ ఓఆర్ కూడా పెరిగింది. కరోనా సమయంలో కూడా ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహించారు. 12 డిపోల పరిధిలో 4,300 మంది ఉద్యోగులు ఉండగా… 150 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకుని తిరిగి యథావిధిగా విధుల్లో చేరిన ఉద్యోగులను అధికారులు అభినందించారు. కర్నూలు రీజియన్‌కు నష్టాలు లేకపోలేదు. రోజుకు రూ.1.20 కోట్ల రాబడి సాధించే సంస్థ రోజుకు రూ.40-50 లక్షల నష్టం భరించాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో రూ.108 కోట్లు, అనంతరం మరో రూ.155 కోట్లతో కలిపిరూ.263 కోట్ల నష్టాల్లో ప్రగతి చక్రం నడుస్తోంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రతినెలా జీతాలతో కార్మికులకు ఇబ్బందులు తొలగాయని, లేని పక్షంలో కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఎదురయ్యేదని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల రద్ధీకి అనుగుణంగా బస్సులు గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సుల సంఖ్య పెంచుతున్నాం. రద్ధీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని డిపో మేనేజర్లను ఆదేశించాం. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగులు, కార్మికుల కృషితో ఓఆర్ 75 శాతానికి చేరింది.
జిల్లా సమాచారం
ఆర్టీసీ బస్సులు: 667
జిల్లాలోని డిపోలు: 12
రోజూ ప్రయాణం: 3.25 లక్షల కి.మీ.
రోజువారీ రాబడి: రూ.1.20 కోట్లు
34 Total Views, 2 Views Today