నల్లమల్ల ఘాట్ వద్ద ఏమైంది…
1 min read
AABNEWS : ఆత్మకూరు మండలంలోని దోర్నాల మార్గమధ్యంలోని రోళ్ళ పెంట ఘాట్ వద్ద కేజీ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అల్లం లోడ్‌తో వెళుతున్న ఓ లారీ మరమ్మతులకు గురై నిలిచిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా కలకత్తా వెళుతున్న ఓ లారీ రోళ్ళపెంట ఘాట్ వద్ద మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరమ్మతులకు గురై రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సాయంత్రం సంఘటనా స్థలం చేరుకుని అల్లం లోడ్‌తో వెళుతున్న లారీకి మరమ్మతులు చేయించి లారీలో ఉన్నలోడ్ను సరిచేసి లారీని పక్కకు తప్పించడంతో ట్రాఫిక్‌జాం క్లియర్ అయింది.
59 Total Views, 2 Views Today