AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పూజారులపై వైసీపీ నేత దాడి…

1 min read

AAB NEWS : కర్నూలు: వైసీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఈసారి ఏకంగా వైసీపీ నేత ఆలయంలో పూజలు చేస్తున్న పూజారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భక్తులకు సాయంత్రం ఉచిత దర్శనం కల్పించాలని ఆలయ పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్ శర్మ, మురుగు ఫణి శర్మ, క్లర్క్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై క్లర్క్.. పూజారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తెలుసుకున్న ఆలయ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అనుచరులతో వచ్చి గర్భగుడిలో పూజలు చేస్తున్న పూజారులపై కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలయిన పూజారులు ఆలయ ఈవో మోహన్‌కు ఫిర్యాదు చేశారు.

 164 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.