AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భరత్ బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు…

1 min read

AAB NEWS : ఈనెల 8 వ తేదీ జరిగే దేశవ్యాప్త బంద్ ను విజయవంతం చేయండి.
వామపక్ష విద్యార్థి సంఘాలు PDSU,AISF, AIYF,PYL,SFI, DYFI బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమైక్య ,GVS, విద్యార్థి యువజన సంఘాల నాయకులు పిలుపు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పార్లమెంటు లో రైతులకు వ్యతిరేకంగా ఆమోదం తెలిపిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష పార్టీలు దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.
నంద్యాల పట్టణంలో సీపీఐ పార్టీ కార్యాలయంలో విద్యార్థి యువజన సంఘాల సమావేశం జరిగింది.
రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు రైతుల పోరాటానికి మద్దతుగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ రాముడు,PDSU జిల్లా సహాయ కార్యదర్శి S.M.D.రఫీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు, SFI పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, PYL జిల్లా నాయకులు నవీన్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు శివ కృష్ణ యాదవ్, GVS జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్, ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి సురేష్ మాట్లాడతూ రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్ కు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా వామపక్ష విద్యార్ధి సంఘలుగాAIYF, PDSU,AISF, SFI, PYL,DYFI , బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమైక్య ,GVS, సంఘాలుగా మద్దతు తెలియజేశారు.కావున 8 వ తేదీన విద్యాసంస్థల బంద్ కు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారని తెలిపారు.దేశవ్యాప్తంగా రైతుల పోరాటానికి మద్దతుగా జరిగే బంద్ కు నంద్యాల పట్టణంలోని ఉన్న ప్రభుత్వ , ప్రైవేట్ స్కూళ్లు, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ ,పీజీ, కళాశాలలో యాజమాన్యం,విద్యార్థులు,తల్లిదండ్రులు, మేధావులు అందరూ విద్యార్థి సంఘాల బంద్ కు స్వచ్చందంగా సహకరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు PDSU,AISF,AIYF, SFI, DYFI,PYL విద్యార్థి సంఘాలుగా కోరారు.

 184 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.