November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కలెక్టర్ గారికి నారాయణపేట తాసిల్దార్ గారికి తరపున వినతి పత్రం…

1 min read

AAB NEWS : దళితులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి నారాయణపేట తాసిల్దార్ గారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో తరపున వినతి పత్రం.విషయం: కోస్గి మండలం బోగారం గ్రామంలో దళితుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులైన దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అర్జీఅమ్మా!తమరితో మనవి చేయునది ఏమనగా కోసిగి మండల పరిధిలోని బోగారం గ్రామంలో గొల్ల కరణం మల్లికార్జున తో పాటు దాదాపు 30 మంది బిసి కులస్తులు ఈనెల 20వ తేదీన దళితవాడలకు వెళ్లి దళితుల పై దాడికి పాల్పడ్డారు ఈ విషయమే కోస్గి పోలీసులకు బాధిత దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 2018 ప్రకారం కేసు నమోదు చేయాలని తమకు న్యాయం చేయాలని రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయడం జరిగింది కానీ పోలీసులు బాధితుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సెక్షన్ 15కు వ్యతిరేకంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలియవస్తున్నదిదళితవాడకు వెళ్లి దాడికి పాల్పడిన నిందితులే మతిస్థిమితం లేని. ప్రభుత్వం ద్వారా పింఛన్ తీసుకుంటున్న ఒక వ్యక్తి చేత దళితులు తనపై దాడి చేశారని ఫిర్యాదు ఇప్పించారు వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ఫిర్యాదు ద్వారా 13 మంది దళిత బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు దాడి జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తాసిల్దారు గారు కానీ డి.ఎస్.పి గ్రామాన్ని సందర్శించలేదు దళితులపై దాడిని నిరసిస్తూ కోస్గి తాసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాలతో జరిగిన ధర్నా ద్వారా ఈ విషయాలను మీకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది అధికార యంత్రాంగం పూర్తిగా రాజ్యంగా చట్ట ఉల్లంఘనలను పాల్పడుతూ ఏకపక్షంగా నిందితులకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్నది స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది కానీ దళితులపై ఇక్కడ ఈ రకమైన దాడులు అణచివేత పద్ధతులు కొనసాగుతుంటే దళితుల హక్కులను పరిరక్షించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు దీంతో ఆ గ్రామంలోని దళితులకు రక్షణ లేకుండా పోయిందికావున నిందితులపై ఇప్పటికే పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం 2018 ద్వారా చర్యలు తీసుకొని హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే వారిని అరెస్టు చేయాలని కోరుతున్నాను బాధితుల పై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము దళితులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాని పక్షంలో దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ 11వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తున్నాందళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక నారాయణపేట జిల్లాపాల్గొన్నవారుకుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు. డి చంద్రశేఖర్ప్రజా కళా మండలి జిల్లా అధ్యక్షులు బి రమేష్బహుజన సమాజ్ వాది పార్టీ అనితఅంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు టి మాధవ్అంబేద్కర్ యువజన సంఘం నారాయణపేట అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తాయప్ప.చంటిఅంబేద్కర్ యువజన సంఘం నిడుగుర్తి అధ్యక్షులు పాండు
అంబేద్కర్ సంఘం నాయకులు బాలకృష్ణ కతలప్ప. అశోక్, KVPS కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి టి.హన్మంత్, ఎం. సుందర్ పాల్గొన్నారు.

 17,175 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.