AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కార్యక్రమాలు ప్రారంభోత్సవం…

1 min read

AAB NEWS : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, డేగపూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు, కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.డేగపూడి గ్రామంలో 1 కోటి 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, 90 లక్షలతో నిర్మించిన డ్రైన్లు, 33 లక్షల రూపాయలతో గ్రామానికి నిర్మించిన ప్రధాన రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సచివాలయ భవనాల నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాకాణి.స్క్రోలింగ్ పాయింట్స్:పొదలకూరు మండలంలోని అభివృద్ధి పనులకు 2 సంవత్సరాల పదవీ కాలంలో 125 కోట్ల రూపాయల నిధులు మజూరు చేయించా. డేగపూడి గ్రామానికి 4 కోట్ల రూపాయలు వెచ్చించి, అంతర్గత సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణంతోపాటు త్రాగు, సాగునీటి వసతి కల్పించాం.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన తేదీ నాడు ఠంఛన్ గా అమలు చేస్తున్నారు. అర్హులైన వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. స్వర్గీయ “ఎ.సి.సుబ్బారెడ్డి” గారి నుండి “ఆనం రామనారాయణ రెడ్డి” గారి వరకు ఎంతో మంది ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధులుగా వ్యవహరించి, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా, గతంలో నామీద పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి, దొడ్డిదారిన మంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాంత ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు.ఆనాడు అధికారంలో ఉండి, నేడు అధికారం కోల్పోయి, ప్రజల పైన కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం తప్ప, ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు.మా తండ్రి “కాకాణి రమణారెడ్డి” గారు 18 సంవత్సరాలు సమితి అధ్యక్షులుగా పని చేసి, మీ అందరి ప్రేమాభిమానాలు నాకు ఆస్తులుగా అందించి వెళ్లారు.గ్రామాల్లో ఏదైన చిన్న విభేదాలు ఉన్నా, గ్రామాభివృద్ధికి విఘాతం కలగకుండా కుటుంబ సభ్యులుగా అందరం కలిసి పని చేద్దాం. సర్వేపల్లి నియోజకవర్గానికి రెండు సార్లు శాసన సభ్యునిగా అవకాశమిచ్చి, సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 146 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.