AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కిసాన్ కవాతుకు సంఘీభావంగా నార్త్ రాజుపాలెం లో ట్రాక్టర్ ఆటో ల తో ర్యాలీ…

1 min read

AABNEWS : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న కిసాన్ కవాతు కి సంఘీభావంగా నార్త్ పాలెం లో మంగళవారం సిఐటియు నాయకులు,ఆటో కార్మిక సంఘాలు,రైతు సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు.గ్రామం లో ని హైస్కూల్ వద్ద నుండి మజీద్ వరకు ట్రాక్టర్లు , ఆటో ల తో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ నాయకులూ గొనె దయాకర్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన కవాతును ప్రభుత్వం తిప్పి కొట్టాలని చూసిన అలుపెరగని దీక్షతో రైతులు ఎర్రకోటపై జెండా ఎగర వేయడం జరిగింది అని అన్నారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శించే దేశం శక్తిని ప్రదర్శించే రిపబ్లిక్‌ దినోత్సవానికి సమాంతరంగా రైతు శక్తిని ప్రదర్శించే ఉద్యమ రూపమే రైతు శకటాల కవాతు అని వ్యాఖ్యానించారు.ఈ కవాతు మట్టిని నమ్ముకొని పుడమి బిడ్డల దేశభక్తి అని అన్నారు.వాన, బురద, చలీ, మంచు అన్నింటినీ పోరాటంలో భాగం చేసుకుంటూ అలసటను వదిలి సాగుతూ కొత్తపుంతలు తొక్కుతోన్న రైతు పోరాటం ఇది అని పేర్కొన్నారు.గత 60 రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చేస్తున్న రైతులు చేస్తున్న దీక్షలకు,కవాతుకు మద్దతుగా ఈ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని అన్నారు. వెంటనే ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తు రైతులతో పాటు ప్రజలను ఇబ్బంది పెట్టే చట్టాలను తీసుకోనివస్తున్నారు అని అన్నారు.ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల వెన్నువిరిచే చట్టాలను రద్దు చేయకపోతే రైతులకు మద్దతుగా అన్ని వ్యవసాయ సంఘాలు,రైతు సంఘాలు,కార్మిక సంఘాల ఉద్యమ పోరాట ప్రతిమను ప్రదర్శించాల్సి వస్తుందని అన్నారు.దేశ శక్తి ప్రదర్శన చూపే గణతంత్రం కాదు….ఇది రైతు గణతంత్రం అని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాడ్డ మస్తానయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయాకర్ రైతు సంఘం నాయకులు డోల రామచంద్రయ్య కుడుముల రోశయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బట్టే పాటి శామ్యూల్ సిఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, వీ దేవానంద్ ప్రసన్న, సురేష్ వెంకటేశ్వర్లు , ప్రజా సంఘo వీ నర్సయ్య, సైయద్ మహబూబ్ బాషా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 376 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.