AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్…

1 min read

AABNEWS : నియంత్రణ చర్యలకు సహకరించకుంటే లాక్డౌన్ ముప్పు తప్పదు – నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు గారు.కరోనా నియంత్రణ చర్యలకు ప్రజలు,వ్యాపారులు సహకరించకుంటే హనుమాన్ జంక్షన్ కు లాక్డౌన్ ముప్పు తప్పదని నూజివీడు డిఎస్పీ బి. శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక కాకాని కళ్యాణ మండపంలో హనుమాన్ జంక్షన్ పోలీసుల ఆధ్వర్యంలో కరోన నియంత్రణ చర్యలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.జంక్షన్ సిఐ డి.వి రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఎస్పీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వర్తకులను,వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో విధించిన లాక్డౌన్ సమయంలో అన్నివర్గాల వారు పోలీస్ శాఖకు సహకరించినట్లే ఈ సమయంలో సహకారాన్ని అందించాలని కోరారు.పోలీసులు విధించిన కరోన నియంత్రణ చర్యలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించడం మరియు దుకాణాలును శాశ్వతంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ సదస్సులో హనుమాన్ జంక్షన్ ఎస్ఐలు చంటి బాబు,ఉషారాణి,వీరవల్లి ఎస్ఐ బాషా,రోడ్ సేఫ్టీ మొబైల్ ఎస్ఐ సుందరరావు, హనుమాన్ జంక్షన్ పోలీసు సిబ్బంది, హనూమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహిళ పోలీసులు, తదితరులు హాజరయ్యారు.

 311 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.