AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కేజ్రీవాల్ అత్యవసర సమావేశంకీలక నిర్ణయం…

1 min read

AABNEWS : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారులతో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.ఆయన నివాసంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది.ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.కరోనా కేసులు ఇష్టానుసారం పెరిగిపోతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.ముఖ్యంగా, తదుపరి నోటీసులు వెలువడే వరకు 8వ తరగతి వరకు పాఠశాలలు మూసివేయనున్నట్టు తెలుస్తోంది.కరోనా కట్టడికి ఇటీవల ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లిళ్లలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 200కు, క్లోజ్‌డ్ స్పేస్‌లో అయితే 100 మందికి పరిమితం చేసింది.అలాగే, ఏప్రిల్ 30 వరకు అంత్యక్రియలకు 50 మందికి మించి హాజరు కారాదని ఈ వారం మొదట్లో ఆదేశాలు జారీ చేసింది.కాగా, ఢిల్లీలో లాక్‌డౌన్ విధించనున్నట్టు వస్తున్న వార్తలను సత్యేంద్రజైన్ ఇప్పటికే కొట్టిపడేశారు.కరోనా వైరస్ కట్టడికి అది పరిష్కారం కాదని తేల్చి చెప్పారు

 106 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.