AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కొత్తగా 1,031 కరోనా కేసులు…

1 min read

AAB NEWS : అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,031 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,65,705కు చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 1081 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ్టివరకు 8,46,120 మంది కోలుకున్నారు. మరో 12,615 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 6,970 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 98,55,316 శాంపిళ్లు పరీక్షించినట్లు పేర్కొంది.

 140 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.