AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు…

1 min read

AABNEWS : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేశాడు. చెన్నైలోని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వెళ్లి ఓటేసిన వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అయితే విజయ్ స్టంట్ పొలిటికల్ కాంట్రవర్సీకి దారి తీసింది. ఇంధన ధరలను పెంచడానికి నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైకిల్ పై వెళ్లాడని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై విజయ్ అధికార ప్రతినిధి ఒకరు క్లారిటీ ఇచ్చాడు.విజయ్ రోడ్డుమార్గంలో సైకిల్ పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. విజయ్ ఇంటికి పోలింగ్ కేంద్రం దగ్గరుంది. అక్కడికి కారులో వెళ్తే పార్కింగ్ చేయడం కష్టంగా ఉండటం వల్ల సైకిల్‌పై వెళ్లాడని తెలిపారు. విజయ్ సైకిల్ రైడ్ పై వివాదం సృష్టించొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ టైం మొదలైందని మరోసారి వార్తలు రాగా..వాటిని కొట్టిపారేశాడు.

 626 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.