AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కోవిడ్ బాధితుల వైద్యం కోసం పలకా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం…

1 min read

AABNEWS : ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న కోవిడ్ బాధితులకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పిలుపు మేరకు రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి పలకా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ పలకా రవి సోమవారం ఆక్సిజన్ సిలిండర్, మెరుగైన వైద్యం కొరకు తన సొంత నిధులు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక వంద పడకల ఆసుపత్రిలో సోమవారం ఆర్డీవో సీతారామయ్య ఆసుపత్రి సూపర్డెంట్ శ్రావణ్ కుమార్ సమక్షంలో లక్ష రూపాయల చెక్కును పలకా రవి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో సీతారామయ్య మాట్లాడుతూ, యువజన నాయకుడు పలకా రవి కోవిడ్ బాధితులు కొరకు ఆక్సిజన్, మెరుగైన వైద్యం కొరకు ఆస్పత్రికి తన సొంత నిధులు అందజేశారని ఆయన అభినందించారు పలకా రవి ని ఆదర్శంగా తీసుకొని పట్టణ ప్రజలందరూ ఆర్థిక సాయం చేయవలసిందిగా ఆయన ప్రజలను కోరారు. రవి మాట్లాడుతూ ఎవరు ప్రాణాలు కోల్పో కూడదనే ఉద్దేశంతో తన ట్రస్టతరఫున ఆర్థికసాయం చేసామని రవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాసరావు , విద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 122 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.