క్రైస్తువులు ఎప్పుడూ భక్తి మార్గంలోనే ఉంటారు …
1 min read
AABNEWS : రాష్ట్రంలో దేవాలయాలు పై జరుగుతున్న దాడులు క్రిస్టియన్ మతం క్రైస్తవులపై నిందలు మోపడం హేయమైన చర్యలు అనీ కోట,వాకాడు, చిట్టమూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ చైర్మన్ వేము దినకర్ బాబు తీవ్రంగా ఖండించారు, శుక్రవారం కోట పట్టణంలోనీ ఎన్ సి ఆర్ నగర్ నందు బేరకా చర్చీలో కోట,వాకాడు, చిట్టమూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ వేము దినకర్ బాబు మాట్లాడుతూ క్రైస్తవులు ఎప్పుడూ కూడా క్రీస్తును ఆరాధించడం తప్ప ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించడం, ఉగ్రవాదను ప్రేరేపించడం వాటికి దూరం అన్నారు, ప్రపంచంలో ఎక్కడైనా క్రైస్తవులు హిందూ,ముస్లిం పై దాడులు చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు, క్రైస్తవులకు రాజకీయ రంగులు పులమడం మంచి పద్ధతి కాదని, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ మతం లో పూజారులకు, ముస్లిం మతంలో ఇమామి లకు ఇచ్చినట్లే క్రిస్టియన్ మతం లో పాస్టర్లకు సహాయం చేయడం జరిగింది తప్ప క్రైస్తవులకు అంటూ ప్రత్యేకంగా ఏమి చేయలేదు అనీ ఆయన తెలియజేశారు, రాష్ట్రంలో దేవాలయాలు పై దాడులు ఎవరూ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకు తెలియదు అనీ కానీ ఆ దాడులను క్రైస్తవులపై రుద్దితే మాత్రం చూస్తూ ఊరుకొము అనీ ఆయన హెచ్చరించారు, క్రైస్తవులకు ప్రేమానురాగాలు తప్ప హింసావాదం తెలియదు అన్నారు, ఇప్పటివరకు భారతదేశం లో క్రైస్తవులపై దాడులు జరిగి ఉన్నాయి తప్ప క్రైస్తవులు ఎవరూ పైన దాడులు చేసిన చరిత్ర ఉందా అని ఆయన ప్రశ్నించారు, క్రైస్తవులకు ఎప్పుడూ కూడా కెవిసిపాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు, కోట పట్టణంలో ఇప్పటి వరకు క్రైస్తవులకు సమాధుల తోట లేదు అని అందువలన క్రైస్తవుల కోసం సమాధులు తోట నిర్మాణంకు చర్యలు తీసుకుంటున్నాం అనీ తెలిపారు, భూమి పూజ కార్యక్రమం ఏర్పాటుకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు,కోట పట్టణానికి చెందిన వైసీపీ నేత నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాం అనీ ఆయన వెల్లడించారు, ఈ కార్యక్రమంలోఅసోసియేషన్ ప్రతినిధులు, పాస్టర్లు నోవా బాబు,శ్యామ్ సుందర్,అసమినన్,ప్రభాకర్, జాకబ్ రమణయ్య కేవీపీ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
162 Total Views, 2 Views Today